క్షుద్ర పూజల్లో బీరు టిన్నులు.. ట్రెండ్​ మారింది బ్రో

జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. వెల్గటూరు మండలం కోటి లింగాల ఆర్​అండ్​ఆర్​కాలనీ సమీపంలోని చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పసుపు, కుంకుమ, అన్నం ముద్దలు, నిమ్మకాయలు, పూలు  కలిపి ఓ చోట ఉంచి నిత్యం ఈ తతంగం జరుపుతున్నట్లు ఆరోపిస్తున్నారు.  అయితే సాధారణంగా క్షుద్ర పూజలకు పల్లెటూళ్లలో కల్లు వాడుతుంటారు.  

ALSO READ :కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య

కానీ ఇక్కడ విచిత్రంగా 3 బీరు టిన్నులు ఉంచారు. వారం రోజులుగా ఇదే తరహా క్షుద్ర పూజలు చేస్తూ భయపెడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.  స్థానికుల్లో ఒకరు ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తుండగా.. పోకిరీల పనిగా మరి కొందరు భావిస్తున్నారు. ప్రజలు ఇలాంటి మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.