రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో.. పెట్రోల్ బదులు నీళ్ళతో వాహనాలు నడిస్తే బాగుండు అనే పరిస్థితికి వచ్చేశాం. అందరూ ఆలోచనల దగ్గరే ఆగిపోతే.. ఓ అమెరికన్ ఆవిష్కర్త మాత్రం.. ఆ ఆలోచనలకు కార్యరూపం దాల్చి, నిరూపించుకున్నాడు కూడా. అయితే మనం చెప్పినట్టు నీటితో కాదు. బీరుతో..
మైఖేల్సన్ అనే అమెరికన్ ఆవిష్కర్త ఇంతకుమునుపు కారులో పెట్రోలుకు బదులు బీరు పోసి, నడిపించి చూపించాడు. ఈ సారి ఇంకో అడుగు ముందుకేసి బీరుతో బైక్ నడిపాడు. అమెరికాలోని మిచిగాన్‌లో నివాసం ఉంటున్న మైఖేల్‌సన్.. బీర్‌తో నడిచే బైక్ ను కనుగొని ట్రెండింగ్ లో నిలిచాడు. వింత వింత ఆలోచనలతో వెరైటీ ఆవిష్కరణలు చేయడం మెఖేల్సన్ కు కొత్తేం కాదు. అది రాకెట్‌తో నడిచే టాయిలెట్ అయినా లేదా జెట్ పవర్డ్ కాఫీ పాట్ అయినా.
ఈసారి, తన గ్యారేజీలో ఉన్న 14-గ్యాలన్ క్యాస్క్‌లో పెట్రోల్‌కు బదులుగా బీరుతో నడిచే ఇంజిన్‌ను తయారు చేశాడు. తానేమీ బీరు తాగను కానీ పెరుగుతున్న ఇంధనం ధరలు చూసి ఈ తరహా బైక్‌ను సృష్టించానని చెప్పారు. ఈ బైక్ వేగం 150 m/h ఉంటుంది.
అద్భుతమైన ఆవిష్కరణ
డైలీ స్టార్ నివేదిక ప్రకారం, మైఖేల్సన్‌తో పాటు, అతని కుమారులు కూడా అలాంటి ఆవిష్కరణలలో పాల్గొంటారు. బీర్ మాత్రమే కాకుండా రెడ్ బుల్ లేదా మరేదైనా డ్రింక్ వంటి ఏదైనా లిక్విడ్ కారును నడపగలదని వారు అంటున్నారు. ఈ తండ్రీకొడుకులు తమ గ్యారేజీని ఓ మ్యూజియంగా చేసి, ఆసక్తికరమైన ఆవిష్కరణలు చేశారు.