బెంగళూరులో బీర్ల సంక్షోభం.. ఆఫర్స్ కట్.. మూడు రెట్లు పెరిగిన డిమాండ్

ఎండాకాలంలో నీటి కొరత గురించి ప్రతి ఏడాది వింటూనే ఉంటాం కానీ, బీర్ల కొరత ఏర్పడటం ఎప్పుడైనా విన్నారా. ఈసారి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో బీర్ల కొరత ఏర్పడింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిసితితులు ఒక కారణమైతే, రెట్టింపైన డిమాండ్ మరొక కారణమని చెప్పచ్చు.బెంగళూరులో పెరిగిన డిమాండ్ కారణంగా పబ్స్, బ్రివరీస్ లలో బీర్ల కొరత ఏర్పడిందని సదరు పబ్స్, బ్రివరీల ఓనర్లు చెబుతున్నారు. సమ్మర్ స్టార్టింగ్ నుండి బీర్లకు డిమాండ్ పెరగటం, పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా ప్రొడక్షన్ లేకపోవటంతో షార్టేజ్ ఏర్పడింది.

ఈ ఏడాది బీర్ల సేల్స్ మూడు రేట్లు పెరిగాయని, ఈ రేంజ్ లో డిమాండ్ పెరుగుతుందని ఊహించలేదని అంటున్నారు పబ్స్ ఓనర్లు. ఏటా 9వేల లీటర్ల బీరు అమ్మకాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటికే 30వేల లీటర్ల బీర్ అమ్మకాలు జరిగినట్లు తెలిపాడు ఒక పబ్ ఓనర్. ఐపీఎల్ సీజన్ కూడా బీర్ల డిమాండ్ పెరగటానికి కారణమని అంటున్నారు. బీర్ల కొరత కారణంగా 2+1 ఆఫర్ ని కూడా రద్దు చేశాయి చాలా పబ్ లు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని, ఈ సంక్షోభం నుండి బయటపడటానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు పబ్స్, బ్రివరీల ఓనర్లు. మరి, మందుబాబులకు బీర్ల కొరత రూపంలో వచ్చి పడిన సంక్షోభం ఎప్పుడు తీరుతుందో చూడాలి.