- పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తన ఆస్తులను పెంచుకోవడం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య విమర్శించారు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లికి చెందిన 100 మంది శివాజీ యూత్, భజరంగ్ దళ్ యూత్, జై హనుమాన్ యూత్‌తో పాటు పలు పార్టీల లీడర్లు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అన్ని రకాలుగా అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీకి అలవాటు పడి అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలపై అకారణంగా కేసులు పెట్టించి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీ చీర శ్రీశైలం, నేతలు బాలరాజు గౌడ్, భరత్ గౌడ్, మల్లేశం, సునీత, మధుసూదన్ రెడ్డి, హేమంత్, ప్రవీణ్, వెంకటేశ్, సాయి, యాదగిరి పాల్గొన్నారు.