వారంలోగా కొండపైకి ఆటోల పునరుద్ధరణ : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరికొండపైకి వారంలోగా ఆటోలు నడిచేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆలయ ఆఫీసర్లను ఆదేశించారు.  శనివారం యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్ లో ఆలయ ఈవో, ఆర్అండ్‌‌బీ ఆఫీసర్లతో  రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెంపుల్ అభివృద్ధిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించే లోపు కొండపైకి ఆటోలను పునరుద్ధరించాలన్నారు. అలాగే  భక్తుల అత్యవసర వసతి, సామాగ్రిని భద్రపర్చుకునేందుకు డార్మిటరీ హాల్ ను సిద్ధం చేయాలని సూచించారు.

 ప్రసాద విక్రయశాల పక్కన గతంలో బాలశివాలయం ఏర్పాటు చేసిన ప్లేస్ లో టెంపరరీ డార్మిటరీ హాల్ ఏర్పాటు చేద్దామని అధికారులు చెప్పగా.. అయిలయ్య ఓకే చెప్పారు.  అనంతరం ఆలయ ఈవో ఆధ్వర్యంలో టెంపుల్‌‌, ఆర్అండ్‌‌బీ ఆఫీసర్లు  ఆ స్థలాన్ని పరిశీలించారు. మీటింగ్‌‌లో ఆలయ ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆర్అండ్‌‌బీ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, డీఈ సునీల్ కుమార్, ఇంజినీరింగ్ ఈఈ దయాకర్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు తదితరులు ఉన్నారు.

సైదాపురం ప్రజల రుణం తీర్చుకోలేనిది

యాదగిరిగుట్ట, వెలుగు: సైదాపురం ప్రజల రుణం తీర్చుకోలేనిదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెప్పారు. శనివారం సొంతూరైన యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో రైతువేదిక, కురుమ సంఘం భవనాలను ప్రారంభించడంతో పాటు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. వరుసగా 30 సార్లు మిల్క్ సెంటర్ చైర్మన్‌గా, సైదాపురం  సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా గెలిపించడంలో గ్రామ ప్రజల పాత్ర వెలకట్టలేనిదన్నారు.

గ్రామాన్ని  మోడల్ విలేజ్‌‌గా డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్ బీర్ల శంకర్, ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్ రెడ్డి, బీర్ల ఫౌండేషన్ డైరెక్టర్ శిఖ ఉపేందర్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ పాల్గొన్నారు.