రజాకార్లలా కేసీఆర్ పాలన : బీర్ల అయిలయ్య

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన రజాకార్ల ఆగడాలను తలపిస్తోందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య విమర్శించారు.  యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం సంగ్యాతండాకు చెందిన ఇతర పార్టీలకు చెందిన 100 మంది నేతలు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వకపోగా..  గతంలో కాంగ్రెస్ పంపిణీ చేసిన భూములను  గుంజుకున్నారని ఆరోపించారు.  

అభివృద్ధి కోసం అప్పులు చేశామంటున్న కేసీఆర్.. అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ జేబులు నిండాయే తప్ప బీడు భూములు తడవ లేదన్నారు.    ఈ కార్యక్రమంలో నేతలు  మధుసూదన్ రెడ్డి,  శంకర్ నాయక్,  చాడ భాస్కర్ రెడ్డి,  మోహన్ బాబు,  సోమల్ల వెంకటేశ్,  పట్టునాయక్,   రఘు,  వెంకటేశ్,  వెంకటేశ్,  రాజారాం నాయక్ ఉన్నారు.