యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తం : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ని  రాష్ట్రానికే మోడల్  గా  చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.  బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు.  యాదగిరిగుట్ట మున్సిపాలిటీగా మారినా..  గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం  వల్ల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..  పట్టణాన్ని పట్టించుకోలేదని చెప్పారు.  

పెద్దమోరీలో పేరుకుపోయిన చెత్త కారణంగా దాదాపుగా 200 కుటుంబాలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని,  వెంటనే  పెద్దమోరీని క్లీన్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. నిధుల కొరత వల్ల నిలిచినపోయిన పలు అభివృద్ధి పనులను అతి త్వరలోనే తిరిగి మొదలుపెట్టనున్నట్లు చెప్పారు.  మున్సిపల్ భవనాలను కూడా యుద్ధప్రాతిపదికన ప్రారంభించి వీలైనంత తొందరగా అందుబాటులోకి తెస్తానన్నారు.  యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు కేటాయించి అత్యాధునిక  కల్పిస్తామని  స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి యాదగిరిగుట్టకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం  కలగకుండా చూస్తామన్నారు. 

'ప్రజాపాలన'పై  అవగాహన సదస్సు .. 

'ప్రజాపాలన' కార్యక్రమంపై యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ లో ఆలేరు నియోజకవర్గ అన్నివిభాగాల అధికారులతో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అవగాహన మీటింగ్ నిర్వహించారు.    నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ప్రతి గ్రామంలో ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.  కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, ముక్కెర్ల మల్లేశ్​ యాదవ్, గౌలీకార్ అరుణ రాజేశ్, సీస విజయలక్ష్మీ కృష్ణ గౌడ్, బబ్బూరి మౌనిక శ్రీధర్ పాల్గొన్నారు.