- శవాన్ని వదిలి పరుగులు పెట్టిన బంధువులు
- మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెంలో ఘటన
కొత్తగూడ, వెలుగు : అంతిమయాత్రపై తేనేటీగలు దాడి చేయడంతో బంధువులు, కుటుంబీకులు పాడెను వదిలేసి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఎంచగూడానికి చెందిన రుద్రారపు వీరస్వామి మంగళవారం చనిపోయాడు. బుధవారం ఆయన అంతిమయాత్ర మొదలుపెట్టారు.
పటాకులు కాలుస్తూ శవయాత్ర కొనసాగిస్తుండగా పెద్ద కుమారస్వామి ఇంటి వద్దకు రాగానే చెట్టుపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా లేచాయి. అంతిమయాత్రలో ఉన్న జనాలపై దాడి చేయడంతో శవాన్ని మోస్తున్న వారు, ముందు, వెనక నడుస్తున్న వారు పాడెను వదిలి ప్రాణాలు దక్కించుకోవడానికి తలో దిక్కు పారిపోయారు. ఈ ఘటనలో సుమారు 20 మంది వరకు గాయపడగా, వీరిని108లో హాస్పిటల్ కు తరలించారు. మళ్లీ గంట తర్వాత తిరిగి అంతిమయాత్ర మొదలుపెట్టి
అంత్యక్రియలు పూర్తి చేశారు.