ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్​ తండాలో శుక్రవారం పొద్దున ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయగా 12మందికి గాయాలయ్యాయి. తండా శివారులో కూలీలు  పనులు చేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తలో వైపు పారిపోయారు. తేనెటీగల దాడినుంచి తప్పించుకునే  క్రమంలో  కొందరికి గాయాలయ్యాయి.  వీరిని ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్​కు తీసుకెళ్లి చికిత్స అందించారు.