బెల్లంపల్లిలో .. శవయాత్రపై తేనెటీగల దాడి

బెల్లంపల్లిలో .. శవయాత్రపై తేనెటీగల దాడి
  • పాడె వదిలేసి పారిపోయిన జనం 

బెల్లంపల్లి, వెలుగు: శవయాత్రపై తేనె తీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పాడె వదిలేసి పారిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.   బెల్లంపల్లి టౌన్ లోని ఏఎంసీ ఏరియా బూడిదిగడ్డ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆడేటి శ్రీనివాస్(40) అనారోగ్యంతో రెండురోజుల కింద మృతి చెందాడు. 

సోమవారం మధ్యాహ్నం శవయాత్ర నిర్వహిస్తుండగా పోచమ్మ చెరువు స్మశాన వాటిక వద్దకు వెళ్లగా తేనె టీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో పాడెను వదిలిపెట్టి భయంతో జనం పరుగులు తీశారు. 38 మందిని తేనె టీగలు కరవడంతో తాళ్ల గురిజాల పీహెచ్ సీలో డాక్టర్ ఎవాంజలి ట్రీట్ మెంట్ చేశారు. అనంతరం గంట తర్వాత వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.