Good Health: దీని దుంప తెగ.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Good Health: దీని దుంప తెగ.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

బీట్​ రూట్​ చూడడానికి ఎర్రగా ఉంటుంది.  ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  భూమిలో పండే బీట్​ రూట్ లో ఎన్నో పోఫషకాలున్నాయి. బరువు తగ్గాలన్నా. జీర్ణక్రియ సరిగా ఉండాలన్నా . శరీరానికి పోషకాలు సరిగా అందాలన్నా బీట్​ రూట్​ ను తినాల్సిందే.  బీట్​ రూట్​ .. అనారోగ్యాన్ని బీట్​ చేస్తుందని చెబుతుంటారు.  బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలను తెలుసుకుందాం. . .

ALSO READ | Good Health:రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

ప్రతిరోజూ ఆహారంలో బీట్​ రూట్​ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయని వెల్లడించారు. ముఖ్యంగా గుండె సమస్యలను తగ్గిస్తుంది అంటున్నారు.  దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి అంటున్నారు. చురుకుగా ఉండటానికి బీట్​ రూట్​ మంచి ఔషధం  మీ డైట్‌లో రోజువారీగా చేర్చుకుంటే ఈ క్రింద తెలిపిన వ్యాధులకు చెక్​ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

​ రక్తపోటును నియంత్రిస్తుంది : బీట్ రూట్ లో ఉండే దుంపల్లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.  ఇందులో ఉండే నైట్రేట్లలో రక్త ప్రసరణను పెంచే లక్షణం ఉంటుంది.  గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది,  

బరువు తగ్గడానికి.. బీట్‌రూట్ లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దాని మొత్తం కేలరీల తీసుకోవడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  బరువు తగ్గాలంటే బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉడికించిన 100 గ్రాముల బీట్​ రూట్​ లో 44 కేలరీలు, 1.7 గ్రాముల ప్రోటీన్​, 0.2 గ్రాముల కొవ్వు, 2 గ్రాములు ఫైబర్​ కంటెంట్​ ఉంటాయి. ఈ డైట్​ ఫాలో అయితే బరువు తగ్గుతారు. 

పోషకాల కోసం:బీట్​ రూట్​లో అధికంగా యాంటీ యాక్సిడెంట్స్​ ఉంటాయి.  శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి.  ఆంథోసైనిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా  కణాల్లో శక్తిని.. సామార్ద్యాన్ని పెంచుతాయి.  ఇందులో ఉండే నైట్రేట్లు  శరీరం పనితీరును మెరుగుపరుస్తాయి.  బీట్​ రూట్​  కార్డియోస్పిరేటరీ పనితీరును మెరుగుపరిచి.. వ్యాయామం చేసేటప్పుడు ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వాపును తగ్గిస్తుంది.. చిన్న దెబ్బ తగిలినా ఆ ప్రదేశంలో వాపు కనపడుతుంది.  ఆ దెబ్బ తగ్గకపోతే అక్కడ మంట కూడా ఉంటుంది. బీట్​ రూట్​  ఎరుపు రంగులో ఉండేందుకు అందులో ఉండే బీటా లైన్లు, పిగ్మెంట్​ లు ఉపయోగపడతాయి. వీటిలో దెబ్బలను త్వరగా తగ్గించి.. వాపును కంట్రోల్ చేసే లక్షణాలుంటాయి.  బీట్ రూట్  శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది. ఇది కీళ్ళు,  మోకాళ్ళ వాపును తగ్గిస్తుంది.  ఇది చేతులు, కాళ్ళకు రక్తం సక్రమంగా ప్రవహించడాకి ఉపయోగపడుతుంది.  నొప్పి, తిమ్మిరి వంటి వాటిని తగ్గిస్తుంది. బీట్ రూట్ రసం రక్త ప్రసరణను పెంచుతుంది.

కాలేయం ఆరోగ్యం కోసం... బీట్ రూట్​ కాలేయాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.  ఇందులో ఉండే ఫైబర్​ గట్​ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు  చెబుతున్నారు.  నిత్యం బీట్​ రూట్​ జూస్​ తాగే వారికి జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.  కాలేయంలో ఉన్న మలిన పదార్దాలను క్లియర్​ చేస్తుంది.  అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్​ స్థాయిని తగ్గిస్తుంది

మెదడును ఆరోగ్యంగా ఉండాలంటే..బీట్​ రూట్​ ను రోజే ఆహారంలో చేర్చుకోవాలి.  వయస్సు పెరిగే కొద్ది మెదడు ఆరోగ్యం కూడా చాలా అవసరం. ప్రతి విషయాన్ని మరిచిపోతుంటారు. బ్రెయిన్​ ఆరోగ్యంగా ఉంటే అలాంటి సమస్య రాదు., బీట్​ రూట్​ మెదడుకు మేలు చేస్తుంది.  రక్తప్రసరణను పెంచడంతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యంతో పాటు ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే నైట్రేట్​ మెదడు సామర్ధ్యాన్ని పెంచుతుంది.