
రైల్వే స్టేషన్ లో నిదురిస్తున్న ప్రయాణికులపై బ్లేడుతో దాడిచేశారు ఇద్దరు యాచకులు. ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో శనివారం అర్దరాత్రి నిదురిస్తున్న ప్రయాణీకులను బ్లేడ్ తో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. అప్పుడే అటుగా వెళ్తున్న టీసి ఉమామహేశ్వర రావు వారిని అడ్డుకోగా.. అతనిపై కూడా బ్లేడుతో దాడిచేశారు. దీంతో టీసి చేతికి గాయమైంది. వెంటనే తేరుకున్న ప్రయాణికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన వాళ్లు తమిళనాడుకు చెందిన వెంకటేశ్, విజయన్ గా గుర్తించారు. వీరిలో ఒకరి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.