అల్లు అర్జున్ ఖైదీ నంబర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?

అల్లు అర్జున్ ఖైదీ నంబర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టవడం, ఆ తర్వాత బెయిల్ మంజూరయ్యి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ జైల్లో ఎలా గడిపాడు, బన్నీకి కేటాయించిన ఖైదీ నంబర్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.. జైలు అధికారులు అల్లు అర్జున్ కి ఖైదీ నంబర్ 7697 ని ఇచ్చారు. అలాగే  మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచారు. ఇక అల్లు అర్జున్ భోజనం చెయ్యకుండా నేలపైనే పడుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ కి ఇచ్చిన ఖైదీ నంబర్ 7697 నంబర్ సోషల్ మీడియాలో చర్చినీయాశంగా మారింది. ఈ నంబర్ ని కూడగా 11 టోటల్ వస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఏపీలోని వైఎస్సార్ సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల సంఖ్యకి ముడిపెడుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

Also Read :- నేను బాగున్నాను.. ఆందోళన అవసరం లేదు

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చెయ్యగా 4 వారాలపాటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో రిలీజ్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నేరుగా జూబ్లీ హిల్స్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళాడు.