పూలన్ దేవి పై కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 40ఏళ్ల క్రితం పూలన్ దేవీ గ్యాంగ్ బెహమై గ్రామంలో 20 మందిని హతమార్చింది. ఈ ఊచకోత కేసును విచారణ చేపట్టిన కాన్ పూర్ థెహాట్ జిల్లా కోర్ట్ జనవరి 24కి వాయిదా వేసింది. ఊచకోత కేసు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన విట్ నెస్ గా ఉన్న ఓ డైరీ మిస్సైంది.
see this : నడిచేందుకు తోడు కావాలా.. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.. కానీ
ఊచకోత కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయవాది సుధీర్ కుమార్ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజు పోర్వాల్ ను డైరీ గురించి ప్రశ్నించారు. అయితే కోర్ట్ రికార్డ్ ల్లో ఉన్న డైరీ మిస్ అయ్యిందని పోర్వాల్ చెప్పడంతో కేసును 24కి వాయిదా వేస్తూ తీర్పిచ్చాడు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో మాట్లాడుతూ కేసు వాయిదా పడేందుకు ఈ కేసులో ప్రధాన సాక్షి జంతర్ సింగ్, ఓ న్యాయవాది కలిసి ఆ డైరీని మాయం చేశారని ఆరోపించారు
డైరీ మిస్సవ్వడంపై సెషన్స్ క్లర్క్ కు కోర్టు నోటీసు జారీ చేసిందని, డైరీని కనిపెట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు పోరాల్ చెప్పారు. ఇక బెహ్మమై ఊచకోత కేసులో పోషా, భిఖా, విశ్వనాథ్, శ్యాంబాబు పాత్రపై కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. కాగా ఈ కేసు నిందితులైన పోషా జైలులో ఉండగా, మిగిలిన వారు బెయిల్‌పై ఉన్నారు.