ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ చైనా రాయబారి మెసేజ్

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ చైనా రాయబారి మెసేజ్

మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి చైనా అభినందన సందేశాన్ని పంపించింది. అయితే సందేశాన్ని స్వీకరిస్తూనే.. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందా లలో సాధారణ స్థితి పునరుద్దరణకు ఇటీవల కాలంలో పదే పదే చెప్పబడిన పరస్పర గౌరవం, సున్నితత్వం, పరస్పర సహకారాన్ని బీజింగ్ కు భారత్ గుర్తు చేసింది. 

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ విషెష్ మేసేజ్ పంపిస్తారని అనుకుంటుండగా..చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, కొత్తగా నియమించబడిన రాయబారి జు ఫీహాంగ్.. మోదీకి విషెష్ మెసేజ్ పంపించారు. భారత్ -చైనాల మధ్య ద్వైపాక్షిక  సంబంధాలను సాధారణ స్థితి పునరుద్దరణకు ప్రయత్నిస్తామని బీజింగ్ నుంచి వచ్చిన సందేశానికి ప్రతిస్పందనగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ లో సమాధానం ఇచ్చారు.  

తూర్పు లఢఖ్ లో గత ఐదేళ్లుగా సైనిక ప్రతిష్ఠంభనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ సెక్టార్ లో నాలుగు పాయింట్ల వద్ద సైనిక విరమణ జరిగినప్పటికీ అనేక దౌత్య చర్చల తర్వాత కూడా డెప్సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో పరిస్థితి అలాగే ఉంది. 

తూర్పు లడాఖ్ లోని మిగిలి ప్రాంతాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి అనేది తూర్పు లడాక్ ప్రతిష్టంభనకు ముందే ఉన్నందున ఎలాంటిచర్చలు లేవన చైనా అంటోం ది. అయితే భారత్ దీనికి ధీటుగానే సమాధానం ఇచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి అవసరమైన చర్యలు కోరుతూ అప్పటివరకు ద్వైపాక్షిక సంబంధాలలో ఎటువంటి పురోగతి ఉండదని తేల్చి చెప్పింది.