
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ. 5,11,971 ఆదాయం వచ్చిందని ఈ నగదును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెజ్జంకి శాఖలో జమ చేశామని ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపులోఎండోమెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, జీపీ కార్యదర్శి, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.