బెల్‌లో ఇంజినీర్ జాబ్స్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టెన్యూర్ బేసిస్‌పై 229 ఇంజినీర్ల నియామకానికి అప్లికేషన్స్ కోరుతోంది. బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి. వయసు 28 సంవత్సరాలు మించరాదు. జీతం నెలకు రూ.40,000- నుంచి రూ.1,40,000. ఏడాదికి సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.12.5 లక్షలు అందుతుంది.
సెలెక్షన్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bel-india.in వెబ్సైట్లో సంప్రదించాలి.