బెల్లో ఇంజినీర్ పోస్టులు

బెల్లో ఇంజినీర్ పోస్టులు

ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్​ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్, బెంగళూరు అప్లికేషన్లను కోరుతున్నది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా ఆఫ్​​లైన్​ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు: ట్రైనీ ఇంజినీర్​–1: 67, ప్రాజెక్టు ఇంజినీర్–1: 70. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్​ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు 28 ఏండ్లు, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు 32 ఏండ్ల వయోపరిమితి మించకూడదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు సడలింపు ఉంటుంది. 

సెలెక్షన్​ ప్రాసెస్: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష, షార్ట్​ లిస్టింగ్​ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్​ ఇంజినీర్ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది