బెల్​లో డిగ్రీ అర్హతతో సీనియర్ అసిస్టెంట్​ ఉద్యోగాలు.. జీతం రూ. లక్షా 20వేలు

బెల్​లో డిగ్రీ అర్హతతో సీనియర్ అసిస్టెంట్​ ఉద్యోగాలు.. జీతం రూ. లక్షా  20వేలు

సీనియర్ అసిస్టెంట్​ ఆఫీసర్ పోస్టులను ఫిక్స్ డ్​​ టర్మ్​ ప్రాతిపదికన భర్తీ చేయడానికి భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్, బెంగళూరు నోటిఫకేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టు : సీనియర్ అసిస్టెంట్​ ఆఫీసర్​
  • ఎలిజిబిలిటీ : ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్( హిందీ లేదా ఇంగ్లీష్​ ఒక సబ్జెక్ట్​గా ఉండాలి) ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి 35 ఏండ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • సెలెక్షన్​ ప్రాసెస్ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • జీతం : నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,00 వరకు చెల్లిస్తారు.
  • అప్లికేషన్​ ఫీజు : 400 + జీఎస్టీ
  • అప్లికేషన్ : ఆఫ్​లైన్​ ద్వారా. డిప్యూటీ మేనేజర్, హెచ్ఆర్, భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్లాట్​ నెం 405, ఇండస్ట్రియల్​ ఏరియా ఫేజ్​–3, పంచకుల, హర్యానా చిరునామాకు స్పీడ్​ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాలి.
  • అప్లికేషన్​ లాస్ట్​ డేట్: 2025, ఫిబ్రవరి 26