న్యూయార్క్: బెలారస్ స్టార్ అరీనా సబలెంకా యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకుంది. మొదటిసారి మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగు పెట్టిన అమెరికన్ జెస్సికా పెగులాతో టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సబలెంక 6–3, 7–6 (7/2)తో అమెరికాకు చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్‌ను ఈజీగా గెలిచిన సబలెంకకు రెండో సెట్‌లో నవారో నుంచి ప్రతిఘటన ఎదురైంది.
చెరో గేమ్ నెగ్గుతూ వెళ్లిన ఈ సెట్ టై బ్రేక్‌కు దారితీయగా.. అక్కడి సబలెంక సత్తా చాటింది. మ్యాచ్ మొత్తంలో ఎనిమిది ఏస్‌లు కొట్టిన అరీనా మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. మరో సెమీస్‌లో పెగులా 1–6, 6–4, 6–2తో అన్‌సీడెడ్ చెక్ ప్లేయర్ కరోలినా ముచోవాపై విజయం సాధించింది. తొలి సెట్‌లో తేలిపోయిన 30 ఏండ్ల పెగులా తర్వాతి రెండు సెట్లలో విజృంభించింది.
తన కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో పెగులా, సబలెంక తలపడనున్నారు. ఇందులో గెలిస్తే పెగులా తొలి గ్రాండ్‌స్లామ్ అందుకోనుంది. సబలెంక నెగ్గితే తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకుంటుంది.