
ప్రముఖ బెల్జియన్ నటి ఎమిలీ డెక్వెన్ 43 ఏళ్ళ వయసులో అరుదైన క్యాన్సర్‌తో మరణించారు. ఆదివారం (మార్చి 16న) సాయంత్రం పారిస్ శివార్లలోని ఒక ఆసుపత్రిలో ఎమిలీ డెక్వెన్ మరణించినట్లు ఆమె కుటుంబం సభ్యులు తెలిపారు. ఆమె వెంట తన భర్త మైఖేల్ ఫెరాచీ మరియు వారి కుమార్తె మిల్లా సవారెస్ ఉన్నారు.
అయితే, అక్టోబర్ 2023లో, ఆమె అడ్రినల్ గ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్ అయిన అడ్రినోకోర్టికల్ కార్సినోమాతో పోరాడుతున్నట్లు వెల్లడించింది. కెరీర్ పీక్ లో ఉండగానే, కేవలం 43 ఏళ్ళ వయసులోనే ఎమిలీ క్యాన్సర్‌తో చనిపోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
ALSO READ | RC16: సినీ, క్రికెట్ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ధోనీ ఆగమనం.. మేకర్స్ క్లారిటీ!
డార్డెన్నే సోదరులు దర్శకత్వం వహించిన 'రోసెట్టా' మూవీలో.. ఎమిలీ తన నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో కేన్స్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ముఖ్యంగా ఫ్రెంచ్ భాషా చిత్రాలలో తాను పోషించిన అనేక పాత్రలకు ప్రశంసలు అందుకుంది.
2009 లో 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' మరియు 2012 లో 'అవర్ చిల్డ్రన్' తో తన సినిమా లైఫ్ కి దోహదపడ్డాయి. 2024లో విడుదలైన ఆంగ్ల భాషా విపత్తు చిత్రం 'సర్వైవ్' నటి ఎమిలీ చివరి సినిమా.