గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్‌‌లో రూ.350 కోట్లు 

నల్గొండ అర్బన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి వివిధ స్కీంల కింద రాష్ట్ర బడ్జెట్‌‌లో రూ.350 కోట్లు కేటాయించిందని షెడ్యూల్ ట్రైబ్స్​ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్  తెలిపారు. సోమవారం నల్గొండలో గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌‌టీల అభివృద్ధికి  అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఈనెల 30న హైదరాబాద్‌‌లో రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాలతో మీటింగ్‌‌ నిర్వహిస్తామన్నారు. బడ్జెట్‌‌లో కేటాయించిన నిధుల వినియోగానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అభిప్రాయాలు సేకరిస్తామన్నారు.  పెండింగ్‌‌లో  ఉన్న యూనిట్లన్నింటిని మంజూరు చేస్తామన్నారు. అనంతరం లంబాడా పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్‌‌లో సన్మానం చేశారు.

కార్యక్రమంలో జిల్లా  గిరిజన సంక్షేమ ఇన్‌‌చార్జి అధికారి, హోజింగ్‌‌ పీడీ రాజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, లంబాడా పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ సక్రునాయక్, శ్రీరాముడు నాయక్, యాదగిరి నాయక్, శ్రీను నాయక్, రమేష్ నాయక్, ఆర్డీవో రవి, డీఎస్పి శివరాం రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్ పాల్గొన్నారు.