
బెల్లంకొండ గణేశ్(Bellamkonda ganesh) హీరోగా రాకేష్ ఉప్పలపాటి(Rakesh uppalapaati) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "నేను స్టూడెంట్ సర్"(Nenu Student sir). నాంది(Naandi) వంటి సూపర్ హిట్ తరువాత సతీష్ వర్మ(Sathish varma) నిర్మించిన ఈ సినిమాలో అవంతిక దస్సాని(Avanthika Dassani) హీరోయిన్ గా నటించగా.. జూన్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పటికే, ఓవరీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పూర్తయ్యాయి. సినిమా చూసిన చాలా మంది ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి నేను స్టూడెంట్ సర్ సినిమాపై ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటీవ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు కథ చాలా కొత్తగా ఉందని, అందులో వచ్చే ట్విస్ట్స్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయని, ఎమోషనల్ డ్రామా కూడా సూపర్ గా ఉందని, మొత్తంగా సినిమా థ్రిల్ కలిగించేలా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక తన రెండో సినిమాతో బెల్లంకొండ గణేష్ మంచి హిట్ కొట్టాడనే టాక్ వినిపిస్తుంది.