టాలీవుడ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నూతన దర్శకుడు లుధీర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న BSS12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత మహేష్ చందు మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా హైందవ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సాయి శ్రీనివాస్ కి జంటగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది.
బుధవారం హైందవ సినిమా టైటిల్ గ్లింప్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో కొందరు దుండగులు రాత్రి సమయంలో ఆలయాన్ని తగలబెడుతుండగా సాయి శ్రీనివాస్ రక్షిస్తాడు. ఈ క్రమంలో దేవతా వాహనాలైన సింహం, అడవి పంది వంటి జంతువులు కూడా హీరోకి సహకరిస్తాయి.
ALSO READ | Daaku Maharaaj: డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
టేకింగ్, ఫైట్స్ కంపోజింగ్, యాక్షన్ ఎక్స్ ప్రెషన్స్ ఇవన్నీ కూడా లుధీర్ రెడ్డి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గ్లింప్స్ లోని విజువల్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇక లియోన్ జేమ్స్ బ్యాగ్రౌండ్ కూడా ఫర్వాలేదనిపించింది. మొత్తానికి కొంత గ్యాప్ తీసుకుని హైందవ తో వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సాయి శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి(తెలుగు రీమేక్) అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక తెలుగులో నటించిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో హైందవతో హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.