ఇంటెన్స్, యాక్షన్ ప్యాక్డ్ స్టోరీస్‌‌తో..బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

ఇంటెన్స్, యాక్షన్ ప్యాక్డ్ స్టోరీస్‌‌తో..బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌.. తెలుగు తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతోంది. రెండేళ్ల క్రితం నటించిన  ‘ఛత్రపతి’ హిందీలో మాత్రమే విడుదలైంది. ఈ ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శుక్రవారం బర్త్‌‌డే సందర్భంగా కొత్త ప్రాజెక్టులను తెలియజేస్తూ.. ఇది తనకు బ్లాస్టింగ్ ఇయర్ అంటూ ప్రకటించారు ఆయా మూవీ మేకర్స్. ఇంటెన్స్, యాక్షన్ ప్యాక్డ్ స్టోరీస్‌‌తో నాలుగు ఎక్సయిటింగ్‌‌ లైనప్‌‌తో రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.  సాయి శ్రీనివాస్, మంచు మనోజ్,  నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల రూపొందిస్తున్న  ‘భైరవం’  చిత్రం నుంచి సాయి శ్రీనివాస్, అదితి మధ్య సాగే పాటను హీరో నాని విడుదల చేసి టీమ్‌‌కు బెస్ట్‌‌ విషెస్ చెప్పాడు.

ఇందులో సాయి రగ్డ్ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. అలాగే సాయి హీరోగా తన 11వ సినిమా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు లుధీర్ బైరెడ్డి డైరెక్షన్‌‌లో తన 12వ మూవీని ప్రకటించాడు. మహేష్ చందు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన బర్త్‌‌డే పోస్టర్ ఆకట్టుకుంది. రెండు కాళ్లను  సీటుపై పెట్టుకుని బైక్‌‌ను నడుపుతున్న లుక్ మెస్మరైజ్ చేస్తుంది. వీటితోపాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి టీమ్ తనకు బర్త్‌‌డే విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేసింది.