
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలయికలో ఓ మూవీ తెరకెక్కనుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓరానున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
హారర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాకు 'కిష్కిందపురి' అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ప్రీ బజ్ వీడియో రిలీజ్ చేశారు. మసక చీకటి, ఓ ఒంటరి అడవి, అందులో వింతగా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి.. ఇవన్నీ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read:-జక్కన్న మాస్టర్ ప్లాన్.. కొత్త షెడ్యూల్తో పాటు.. SSMB29 బిగ్ సర్ప్రైజ్!
దానికితోడు " నా నడకకి గమ్యం లేదు.. నా ఒంటికి చలనం లేదు.. నా మనసుకి మార్గం లేదు..ఎందుకంటే, నాకు ప్రాణం లేదు" అంటూ చెప్తూ భయాన్ని పుట్టించే మాటలు 'కిష్కిందపురి' కి తీసుకెళ్లేలా చేస్తున్నాయి. అంతేకాకుండా 'కిష్కిందపురిలో, నడిచే ప్రతిదీ సజీవంగా లేదు' అంటూ క్యాప్షన్ ఇచ్చి మరింత థ్రిల్లింగ్ పెంచేశారు. ఏప్రిల్ 18న గ్లింప్స్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సినిమాతో బెల్లకొండ స్ట్రాంగ్ హిట్ కొట్టేలా స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సాయి శ్రీనివాస్ మరో కొత్త ప్రాజెక్ట్ BSS12. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ గా రానుంది. 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెల్లంకొండ నటించిన భైరవం మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది.