KishkindapuriGlimpse: హారర్ మిస్టరీతో బెల్లంకొండ ‘కిష్కిందపురి’.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫస్ట్ గ్లింప్స్

KishkindapuriGlimpse: హారర్ మిస్టరీతో బెల్లంకొండ ‘కిష్కిందపురి’.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫస్ట్ గ్లింప్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్గా కిష్కిందపురి మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హారర్ మిస్టరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌తో కిష్కిందపురి గ్లింప్స్ సాగింది. మసక చీకటి, ఓ పాడుబడ్డ బంగ్లా, అందులో వింతగా కనిపించే భయానకమైన దృశ్యాలు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఆ బంగ్లాలో హీరో హీరోయిన్స్ ఇద్దరు ఏదో నిగూఢమైన సమాచారం కోసం వెతకడం, అప్పుడు హీరో చేతికి ఏదో దొరకడం, అలా బయటకు భయంతో వేగంగా పరిగెత్తడం వంటి అంశాలు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇక గ్లింప్స్ చివర్లో హీరో సాయి శ్రీనివాస్ ‘అహం మృత్యువు’ అని గట్టిగా అరవడం, ఆసమయంలో అతని కళ్ళు వింతగా మారడం సినిమాపై అంచనాలు పెంచేసేలా చేసింది. 

►ALSO READ |OTT Thriller: ఓటీటీకి పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ మూవీ.. డిఫరెంట్ స్టోరీతో మెడికల్ థ్రిల్లర్..

ఈ గ్లింప్స్ కు మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తిగా ఉంది. 'ఏ మ్యాప్‌లోనూ లేని, ఏ పుస్తకంలోనూ లేని ప్రదేశం ఇది. కానీ ఇక్కడ, నీడల్లో, అది మీ ఎంట్రీ కోసం వేచి ఉంది. కిష్కింధ పురికి స్వాగతం' అంటూ భయాన్ని రేకేత్తించారు.

దానికితోడు ఇటీవలే వచ్చిన ప్రీ బజ్ వీడియో సైతం ఆసక్తి కలిగించింది. " నా నడకకి గమ్యం లేదు.. నా ఒంటికి చలనం లేదు.. నా మనసుకి మార్గం లేదు..ఎందుకంటే, నాకు ప్రాణం లేదు" అంటూ చెప్తూ భయాన్ని పుట్టించే మాటలు 'కిష్కిందపురి' కి తీసుకెళ్లేలా చేశాయి. . అంతేకాకుండా 'కిష్కిందపురిలో, నడిచే ప్రతిదీ సజీవంగా లేదు' అంటూ క్యాప్షన్ ఇచ్చి మరింత థ్రిల్లింగ్ పెంచారు. ఇకపోతే ఈ రెండు వీడియోలకు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి యస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్స్ కలిగిస్తోంది.