నిర్మాతగా పలు హిట్ సినిమాలు తీసిన బెల్లంకొండ సురేష్.. కొన్నేళ్లుగా తన కొడుకుల కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టారు. మరో కొడుకు గణేష్ ఇటీవల ‘స్వాతిముత్యం’తో హీరోగా పరిచయ మయ్యాడు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలియ జేసేందుకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సురేష్ మాట్లాడుతూ ‘రెండు పెద్ద సినిమాల మధ్య రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కొంత భయపెట్టినా.. శుక్రవారానికి పుంజుకుంది.
కంటెంట్ బాగుండటమే ఈ విజయానికి కారణం. హీరోగా తనని నేనెందుకు పరిచయం చేయలేదని ఫీలవడం లేదు. ఎందుకంటే సితార సంస్థ నిర్మాతలు బాగా తీశారు. ఇటీవల బాలకృష్ణ గారితో తీసిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే రూ.5.39 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో ‘ఆది’ సినిమాని ఇంకాస్త ఎక్కువ ప్రమోట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. అలాగే ‘జగదేకవీరుడి కథ’ సినిమాని ఎప్పటికైనా రీమేక్ చేయాలనేది నా కోరిక. అదే నా లైఫ్ యాంబిషన్’ అన్నారు.