బెల్లంపల్లి రూరల్, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేశ్అన్నారు. శనివారం భీమిని మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. స్కూల్లో సౌకర్యాలు, అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. పాఠశాల రికార్డులను చూపించాలని అడగ్గా.. రికార్డులు పాఠశాలలో లేవని ప్రత్యేక అధికారి కవిత బదులివ్వడంతో ఆయన ఆశ్యర్యానికి గురయ్యారు.
వెంటనే రికార్డులను తెప్పించాలని ఆదేశించారు. రాష్ట్రీయ విద్యామిషన్(ఆర్వీఎం) ఏఈ ప్రవీణ్‌తో మాట్లాడి స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం భీమిని మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
తహసీల్దార్ భికరణదాస్, అసిస్టెంట్పబ్లిక్ ప్రాసిక్యూటర్అజయ్కుమార్, బార్అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, సీనియర్‌న్యాయవాదులు గోపి కిషన్ సింగ్, అశోక్, ఎస్ఐ ప్రశాంత్ఉన్నారు.