కోర్టును సందర్శించిన విద్యార్థులు

బెల్లంపల్లి, వెలుగు :  బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ విద్యార్థులు సందర్శించారు. కళాశాల క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కాలేజ్ పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు కె.సమ్మక్క ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్​ చూశారు. జడ్జి ముఖేశ్​ను కలిశారు. కోర్టు నిర్వహణ, న్యాయ సంబంధిత విషయాల గురించి కోర్టు సిబ్బంది స్టూడెంట్లకు వివరించారు.