బెల్లంపల్లి రూరల్, వెలుగు: శరీర అవయ వాల్లో అన్నింటికంటే ముఖ్యమైనవి కళ్లే అని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. సోమవారం నెన్నెల మండలంలోని గంగారాం ప్రజలకు భార్య రమతో కలిసి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన కూతురు డాక్టర్వర్ష ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం నెన్నెల మండల ప్రజల కోసం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారని, కంటి సమస్యలు ఉన్న వారికి ఇప్పుడు అద్దాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
కంటి చూపు సరిగా లేనివారికి ప్రసాదించా లనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి సాధించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేశ్, శ్రీనివాస్, సుధ, మల్లాగౌడ్, మల్లిక, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.