ఘనంగా ఎమ్మెల్యే వినోద్ బర్త్​ డే

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి  ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.  పార్టీ టౌన్   ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్త మారి సూరిబాబుల ఆధ్వర్యంలో  వేరు వేరుగా  కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.  

కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ బత్తుల రవి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, చింత పండు శ్రీనివాస్, సల్లా సంజీవరెడ్డి , పొట్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు ఎంఏ నయీం, రేగుంట రాజలింగు, మల్లారపు చిన్నరాజం, బండి రాము,మేకల శ్రీనివాస్, దాసరి ప్రతాప్, రామగిరి శ్రీనివాస్, తాళ్ళ మోహన్, సూరం బానేష్, గొడుగు రఘు, అంకం రవి, కాసిపాక రాజారత్నం, మంతెన మల్లేష్,  కన్నూరి రాజలింగు, రామగిరి మహేష్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో.. 


తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే గడ్డం వినోద్ జన్మదిన వేడుకలు సోమవారం పట్టణప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి,  జిల్లా అధ్యక్షుడు కుంభాల రాజేశ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.  వేడుకల్లో  దాసరి ప్రతాప్, సబ్బని రాజనర్సు, ఎరుకల శ్రీనివాస్, సమ్మయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.