- కాంగ్రెస్ నాయకుల పిలుపు
బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిస్తేనే బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఆర్పీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకట స్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, నల్లాల ఓదెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ రొడ్డ శారద, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ నాతరి స్వామి, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ తదితరులు మాట్లాడారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 75 వేల నుంచి లక్ష మెజార్టీ గడ్డం వంశీకృష్ణకు తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. వంశీకృష్ణను పార్లమెంటుకు పంపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, టీపీసీసీ ఓబీసీఎల్ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సెక్రెటరీ చొప్పదండి దుర్గాభవాని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.