బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త స్రవంతికి జాతీయ అవార్డు

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యు. స్రవంతి ఉత్తమ యువ శాస్త్రవేత్త జాతీయ అవార్డు అందుకున్నారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో గ్లిసియర్ జనరల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సెలన్స్ 2023 గ్లోబల్ మేనేజ్ మెంట్ కౌన్సిల్ నిర్వహించిన టీచింగ్, రీసెర్చ్, పబ్లికేషన్స్ విభాగంలో ఉత్తమ యువ శాస్త్రవేత్తగా స్రవంతి జాతీయ అవార్డు పొందారు.  తనకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని మంగళవారం ఆమె మీడియాకు చెప్పారు.