వంశీ కృష్ణ గెలుపు ప్రజా విజయం : గడ్డం వినోద్

వంశీ కృష్ణ గెలుపు ప్రజా విజయం : గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందిన గడ్డం వంశీకృష్ణకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుభాకాంక్షలు తెలిపారు. వంశీకృష్ణ విజయం ప్రజల విజయమన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఫోన్ ద్వారా ‘వెలుగు’తో మాట్లాడారు. చిన్న వయసులోనే గడ్డం వంశీకృష్ణను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్​కు పంపడం ఎంతో గర్వకారణమన్నారు. 

ఈ విజయం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. వంశీ గెలుపు కోసం సమష్టిగా కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఎంపీ వంశీకృష్ణ ద్వారా కృషి చేస్తానని వినోద్ అన్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానన్నారు. రైల్వే డిస్పెన్సరీని పూర్తిస్థాయి ఆస్పత్రిగా డెవలప్ చేయడంతో పాటు ఆర్ఓహెచ్ డిపో అదనపు షెడ్డు పనులు వేగంవంతం చేయిస్తానన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు.