కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేపట్టారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న వినోద్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
పరామర్శ
ఎండపల్లి ఎంపీటీసీ ఎండీ బషీర్ తల్లి ఓజ్రబీ ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. దశదిశ కర్మలో పాల్గొని నివాళులర్పించారు. ఎండపల్లి నుంచి తిరిగి వెళ్తుండగా ఎమ్మెల్యేను కాంగ్రెస్లీడర్కాడే సూర్యనారాయణ శాలువాతో సత్కరించారు.