ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ ఇప్పించిన ఘనత కాకాది: ఎమ్మెల్యే వినోద్

ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ ఇప్పించిన ఘనత కాకాది: ఎమ్మెల్యే వినోద్

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమ కుటుంబం పై నిరాధార ఆరోపణలు చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించిన ఘనత  కాకాదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకా కేవీపీతో మాట్లాడి వైఎస్సార్ చొరవతో ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ ఇప్పించారని చెప్పారు.  ఎవరి మీద ఫిర్యాదులు చేసే మనసత్వం తమ కుటుంబానికి లేదన్నారు. గత 70 ఏళ్ల నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందన్నారు. ఇందిరా  , రాజీవ్ ,సోనియా గాంధీ నాయకత్వంలో పని చేశామన్నారు.  

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా ఉన్న సమయంలో  వేల కోట్లు ఖర్చు చేసి , అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు ఎమ్మెల్యే వినోద్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కాకా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టేదార్లు అని చెప్పిన ఘనత తమ ఫ్యామిలీదన్నారు.  ప్రేమ్ సాగర్ రావు తమ కుటుంబానికి మూడు పదవులు ఇచ్చారని అనడం తప్పు ,ఎవరు పదవులు ఇవ్వాలని అడగలేదు పార్టీ అధిష్టానం దే తుది నిర్ణయమని చెప్పారు. మాల,మాదిగలకు తమ కుటుంబం  ఎన్నో రకాలుగా సేవలు చేసిందన్నారు.  అంబేద్కర్ పేరిట విద్యాసంస్థలు అందుబాటులోకి తెచ్చి ఎంతో మందికి ఉచిత విద్య అందించిన ఘనత తమదన్నారు. అధిష్టానానికి ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు కానీ.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయమన్నారు వినోద్.