దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిసామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది తమతమ ఇళ్లలో సందడిగా వేడుకలు జరుపుకున్నారు. గతంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ నివాసంలో గంటలతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ ఏడాది (2024) అలాంటి వినాయకుడిని కొంపల్లిలో కొలువుదీరాడు.
హైదరాబాద్ వ్యాపారసంస్థ రాయ్ చాందినీ గ్రూప్ నిర్వహించే గణపతి ఉత్సవాల్లో గంటలతో తయారు చేసిన వినాయకుడిని ముంబై నుంచి హైదరాబాద్ కొంపల్లి లోని రాయ్ చాందినీ మాల్ కు తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. 12 వేల గంటలతో తయారైన వినాయకుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. గంటల వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. వినాయకుడని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మాల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.