జింబాబ్వే క్రికెటర్ అరుదైన ఘనత..15 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం

జింబాబ్వే క్రికెటర్ అరుదైన ఘనత..15 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం

బిలవుడ్ బిజా జింబాబ్వే మహిళా క్రికెటర్ బిలవుడ్ బిజా 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టింది. దీంతో జింబాబ్వే మహిళా క్రికెట్ లో  అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కురాలుగా ఈమె నిలిచింది. ప్రస్తుతం జింబాబ్వే వేదికగా ఐర్లాండ్  మహిళల జట్టు 5టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.

ఈ సిరీస్ లో చివరిదైన 5వ టీ20 కు బిజాకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. హరారే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఓవరాల్ గా అతి తక్కువ వయసులో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన రికార్డ్ పాకిస్థాన్ ఆల్ రౌండర్ సజ్జిదా షా పేరిట ఉంది. ఈమె తన 12 సంవత్సరాల వయసులోనే డెబ్యూ మ్యాచ్ ఆడింది. 2000 జులై 23 న ఐర్లాండ్ పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.

ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ మహిళల జట్టు 14 పరుగుల తేడాతో జింబాబ్వే మహిళల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. గ్యాబీ లూయిస్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనలో జింబాబ్వే 124 పరుగులకే పరిమితమైంది. ముసొన్దో 52 పరుగులు చేసినా మిగిలిన వారు విఫలం కావడంతో మ్యాచ్ ఓడిపోయింది.