హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?

హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?

తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే,  గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి 40 శాతం పోలింగ్ దాట లేదు. ఎప్పటిలాగే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు సిటీ జనం. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వర్కవుట్ అయినట్లు కనించలేదు.  

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ సిటీలో ఓటింగ్ శాతంపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్  ఉండటంతో చాలా మంది సిటీలోని జనం అక్కడ ఓటేసేందుకు వెళ్లారు.  నగరంలోని వివిధ జిల్లాలకు చెందిన వాళ్లు సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తక్కువగా పోలింగ్  నమోదయినట్లు అంచనా వేస్తున్నారు. 

2019లో గ్రేటర్ లో 44.84 పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17 శాతమే పోలింగ్ రికార్డయింది. పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి.  అయితే మల్కాజిగిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త బెటర్ గా ఉన్నా ఇక్కడ కూడా 50శాతం పోలింగ్ దాటే చాన్స్  కనిపించడం లేదు. 

 మొత్తంగా గ్రేటర్ లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా.. ఓట్లేసే విషయంలో హైదరాబాదీలు ఆసక్తి చూపకపోవటం.. పోలింగ్ శాతం తగ్గటంతో.. అవి ఎటువైపు ఎక్కువగా పడ్డాయనే విషయంపై చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం తగ్గడంతో.. ఏ పార్టీకి ప్లస్ అవుతుందో?.. ఏ పార్టీకి మైనస్ అవుతుందో? అని చర్చించుకుంటున్నారు.