మందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్

మందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్

ఏపీలోని నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపుకి నిర్వాహకులు రెచ్చిపోయారు.. ఎక్సయిజ్ అధికారులు,పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాపు నిర్వాహకులు. నంద్యాల జిల్లాలోని క్రిష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..  మంగళవారం ( ఏప్రిల్ 15 ) తనిఖీలకు వెళ్లిన ఎక్సయిజ్ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు బెల్ట్ షాపు నిర్వాహకులు. మందు బాటిల్స్ టచ్ చేస్తే నరికేస్తామంటూ పోలీసులనే బెదిరించారు బెల్ట్ షాపు నిర్వాహకులు.

ఈ ఉదంతాన్ని వీడియో తీస్తున్న ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ఎస్సై తేజ్  పై దాడి చేశారు బెల్ట్ షాప్ నిర్వాహకులు.మా ప్రభుత్వం వచ్చాక కూడా మమ్మల్ని కొడతావా అంటూ  భూతులతో రెచ్చిపోయారు నిర్వాహకులు. నువ్వు మగాడివైతే  మందు పట్టుకో చూద్దామంటూ రెచ్చిపోయారు.

నువ్వు ఒక్కడివే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే.. దేశం ఏమైనా బాగుపడుతుందా అంటూ పోలీసులనే తిరిగి ప్రశ్నించడం విడ్డూరం. ఈ ఘటనతో అవాక్కయిన పోలీసులు బెల్ట్ షాపు నిర్వాహకుడిని అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.