టేకులపల్లి బెల్ట్ షాపులు సీజ్

ఇల్లెందు(టేకులపల్లి), వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ని పల్లవి వైన్సు ఆదివారం ఖమ్మం స్పెషల్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. విశ్వస నీయ సమాచారం మేరకు మండలంలోని పలు గ్రామాల్లో స్పెషల్ స్క్వాడ్ బృందాలు బెల్ట్ షాపులపై దాడులు చేశాయి. ఓ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద ఉన్న మద్యాన్ని పరిశీలించారు. అదే మండలంలోని పల్లవి వైన్ షాప్ నుంచి తెచ్చినట్లు అతడు తెలపడంతో, ఆ వైన్ షాపును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.