ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని రాయల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో మాస్టర్ సాంబాడి ప్రవీణ్ కుమార్ శిక్షణలో ఉన్న విద్యార్థులకు ఆదివారం ఆర్మూర్ లో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. ఆర్మూర్ ఎస్ హెచ్ వో రవికుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు హాజరై స్టూడెంట్స్ ను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సేఫ్టీ ముఖ్యమని చదువుతోపాటు మనో ధైర్యం ఉండాలన్నారు.
ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యమని చెప్పారు. బెల్ట్ ప్రమోషన్ టెస్టులో గెలుపొందిన స్టూడెంట్స్ కు ఎస్‌హెచ్‌వో, కమిషనర్ చేతుల మీదుగా నూతన బెల్టులను అందజేశారు. రాయల్ తైక్వాండో అకాడమీ స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.