ప్రముఖ అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez), నటుడు బెన్ అఫ్లెక్ (Ben Affleck)విడాకులు తీసుకున్నారు. వివాహమైన 2 సంవత్సరాల తర్వాత ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. జనవరి 6న సమర్పించిన పత్రాలతో ఈ జంట అధికారికంగా విడిపోతున్నట్లు అంగీకారం రాగా..విడాకులు ఫిబ్రవరి 20న ఖరారు చేయబడతాయి.
అయితే, ఏప్రిల్ 26, 2024న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. లోపెజ్ ఆగస్ట్ 20, 2024న విడాకుల కోసం దాఖలు చేసింది. దాదాపు 20 వారాల తర్వాత కోర్టు నుండి ఈ తీర్పు వచ్చింది. ఇరు పార్టీలు విడాకుల నిబంధనలపై అంగీకరించారు. లోపెజ్, బెన్ ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో.. వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులను ఎవరికి వారే నిలుపుకుంటారు. ఇరు పార్టీలు జీవిత భాగస్వామికి మద్దతు చెల్లించాల్సిన అవసరం లేదని TMZ నివేదించింది.
అయితే, ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్కు నాలుగుసార్లు వివాహమైంది. సింగర్ మార్క్ ఆంటోనీతో వివాహమైనప్పుడు ఇద్దరు కవల పిల్లలు మ్యాక్స్, ఎమ్మీ పుట్టారు. 2021లో, జెన్నిఫర్ లోపెజ్.. బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ ప్రారంభించింది. ఏప్రిల్ 2022లో, ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 16, 2022న, ఈ జంట లాస్ వెగాస్‌లో వివాహం చేసుకున్నారు. ఇక 2024 ఆగస్టులో లోపెజ్ సమర్పించిన దరఖాస్తుతో వీరి బంధానికి ఫుల్ స్టాప్ పడింది.