Champions Trophy final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే టీమిండియాను ఓడిస్తాం: స్టార్ ఓపెనర్

Champions Trophy final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే టీమిండియాను ఓడిస్తాం: స్టార్ ఓపెనర్

భారత గడ్డపై ఇంగ్లాండ్ పేలవ ఆట తీరును ప్రదర్శిస్తుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-4 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో కోల్పోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ భారత జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ పరాజయాలు ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అయితే ఈ పరాజయాలు తనను ఏ మాత్రం బాధించట్లేదని ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. భారత్ పై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిస్తేనే అసలు కిక్ అని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

డకెట్ మాట్లాడుతూ.. "మేము అది ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాడానికే ఇక్కడికి వచ్చాము. మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. కొంతమంది ఆటగాళ్లు ఫామ్ లోకి వస్తే మేము టైటిల్ గెలవడం పెద్ద విషయం కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ తో పెద్ద సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వైట్ వాష్ అయినా అస్సలు పట్టించుకోను. భారత్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయినా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో భారత్ ను ఓడించినా నాకు పెద్దగా పట్టింపు ఉండదు". అని ఈ ఇంగ్లీష్ ఓపెనర్ భారత్ క్రికెట్ జట్టుకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్, భారత్ వేరే గ్రూప్ లో ఉన్నాయి. హాట్ ఫేవరేట్ గ బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ లేదా ఫైనల్లో తలబడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక డకెట్ విషయానికి వస్తే తొలి  రెండు వన్డేల్లో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశాడు. 56 బంతుల్లో 10 బౌండరీలతో 65 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) జరుగుతుంది.