
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే మూడు జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఆతిధ్య పాకిస్థాన్ తో పాటు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సెమీస్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. మూడు జట్లు వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలై ఇంటి ముఖం పట్టాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం గ్రూప్ బి లో ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. బాగా ఆడే జట్ల సంగతి పక్కన పెడితే.. ఓడిపోయిన జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నారు.
ఆకీబ్ జావేద్:
పాకిస్థాన్ కోచ్ ఆకీబ్ జావేద్ ఇండియాతో మ్యాచ్ కు ముందు అతి విశ్వాసం చూపించాడు. ఖచ్చితంగా భారత్ ను ఓడిస్తామని.. మ్యాచ్ లో గెలిచి టీమిండియాకు సర్ ప్రైజ్ ఇస్తామని ఆయన తెలిపాడు. అయితే టీమిండియాతో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత భారత్ లాంటి జట్టును తక్కువ అంచనా వేసినందుకు నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేశారు. ఇంకోసారి గొప్పలకు పోయి ఎక్కువగా మాట్లాడకుండా గట్టిగా బుద్ధి చెప్పారు.
బెన్ డకెట్:
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ నాణ్యమైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతని మాటలే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఓపెనర్ కు శాపంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాతో వన్దే సిరీస్ కోల్పోయినప్పుడు డకెట్ ఈ ఓటములు మాకు లెక్క చేయం. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాడానికి మేము ఇక్కడకి వచ్చాము. ఫైనల్లో ఇండియాను ఓడిస్తే ఈ సిరీస్ ఓటమిని ఎవరూ పట్టించుకోరు అని చెప్పాడు. ఇదిలా ఉంటే తమ జట్టు ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డకెట్ ను ఓ రేంజ్ లో నెటిజన్స్ ఆడేసుకుంటున్నాడు.
Bro thought - he is pat Cummins 😭😭😭😂😂
— 𝘼𝙠 𝙎𝙖𝙧𝙖𝙣𝙜𝙞 (@Ak92686Ak) February 26, 2025
Let's laughed at england
Officially knockouts from champion trophy 🏆#Afganistan #ChampionsTrophy2025 pic.twitter.com/apsSWzYde6
నజ్ముల్ హొస్సేన్ శాంటో:
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపాడు. తమ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని.. కుర్రాళ్లు మంచి ఊపు మీదున్నారని అగ్రశ్రేణి జట్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఛాంపియన్లుగా నిలిచి, ట్రోఫీతో బంగ్లా గడ్డపై కాలుపెట్టే సమయం వచ్చిందని ప్రగల్భాలు పలికాడు. అయితే అందరికన్నా ముందే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి ఇంటి దారి పట్టింది. టీమిండియాకు ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ పై నెటిజన్స్ సెటైర్స్ వేశారు.