
మౌంట్ మాగనుయ్: బ్యాటింగ్‌లో రైస్ మారియు (58), బ్రేస్‌వెల్ (59).. బౌలింగ్‌లో బెన్ సియర్స్ (5/34) చెలరేగడంతో.. శనివారం జరిగిన మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ 43 రన్స్ తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడిన కివీస్ 264/8 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (43), హెన్రీ నికోల్స్ (31) మెరుగ్గా ఆడారు. అకిఫ్ జావేద్ 4, నసీమ్ షా రెండు వికెట్లు తీశారు.
తర్వాత పాక్ 40 ఓవర్లలో 221 రన్స్‌కే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (50) టాప్ స్కోరర్. రిజ్వాన్ (37), అబ్దుల్లా షఫీక్ (33), తయ్యబ్ తాహిర్ (33) రాణించినా ప్రయోజనం దక్కలేదు. జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు. బ్రేస్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించగా, సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టిన బెన్ సియర్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.