Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కాదు.. గాయాల ట్రోఫీ: మెగా టోర్నీ నుంచి మరొకరు ఔట్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కాదు.. గాయాల ట్రోఫీ: మెగా టోర్నీ నుంచి మరొకరు ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ టోర్నీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అరడజను మంది స్టార్ ఫాస్ట్ బౌలర్లు గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా ఈ లిస్టులో మరొక యువ పేసర్ చేరాడు. న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ సియర్స్ స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసింది.

"బుధవారం కరాచీలో జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సియర్స్ ఎడమ తొడకు గాయమై నొప్పితో విలవిల్లాడాడు. ఆ తర్వాత చేసిన స్కాన్‌లో గాయం అయినట్టు తేలింది. అతనికి రెండు వారాల రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు సూచించారు". అని న్యూజిలాండ్ క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. "బెన్ పట్ల గాయం బాధిస్తుంది. చివరి నిమిషంలో ప్రధాన ఈవెంట్ నుండి దూరం కావడం ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది అతనికి మొదటి ప్రధాన ఐసీసీ టోర్నీ". అని ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ అన్నారు. సియర్స్ వన్డే ట్రై-సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడాడు. నేడు పాకిస్థాన్ తో జరగబోయే ఫైనల్ కు దూరం కానున్నాడు. 

ALSO READ | WPL 2025: కోహ్లీ గురించి అనవసరం.. 18 నంబర్ జెర్సీపై స్మృతి మంధాన కామెంట్స్ వైరల్

ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌తో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తలపడుతుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇదే గ్రూప్ లో భారత్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ నే నమ్ముకుంది. ఆసియాలో జరగనున్న ఈ టోర్నీలో ఏకంగా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. నాథన్ స్మిత్ , మాట్ హెన్రీయర్స్, లాక్ హెన్రీయర్స్, లాక్ ఓ రూర్కే,జాకబ్ డఫీ లాంటి పేస్ దళంతో బరిలోకి దిగుతుంది. వీరికి ఆల్ రౌండర్లు కెప్టెన్ సాంట్నర్ తో పాటు మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర బంతితో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

న్యూజిలాండ్ జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియంసన్, విల్ యంగ్

న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:

19 ఫిబ్రవరి - పాకిస్థాన్ vs న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి

మార్చి 2 - భారత్ vs న్యూజిలాండ్, దుబాయ్