న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది. కీలకమైన ఈ టెస్ట్ సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ గజ్జల్లో గాయం కారణంగా తొలి తొలి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా కివీస్ యువ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ అధికారికంగా తెలియజేశాడు.
న్యూజిలాండ్ ఇటీవలి శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు ప్రాక్టీస్ లో ఈ ఫాస్ట్ బౌలర్ కు గాయమైంది. సియర్స్ స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీకి అవకాశం దక్కింది. డఫీ.. ఒటాగో తరపున ఆల్-టైమ్ లీడింగ్ వికెట్ టేకర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఈ పేసర్ 299 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే న్యూజిలాండ్ తరపున వన్డే, టీ20 ల్లో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో కెప్టెన్ సౌథీ తో పాటు, హెన్రీ, విలియం ఒరోర్కే లతో కివీస్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తుంది.
భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టామ్ లాథమ్ తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. ఈ సిరీస్ కు ముందు ఫాస్ట్ బౌలర్ సౌథీ తన కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తొలి టెస్ట్ ఆడట్లేదు. బ్యాకప్ గా కేన్ స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను స్క్వాడ్‌లో చేర్చారు.
Ben Sears has been ruled out of the India Test series; Uncapped Jacob Duffy has been called as his replacement pic.twitter.com/Ju6W6rqV0H
— Cricbuzz (@cricbuzz) October 15, 2024