
యాదాద్రి, వెలుగు: యాదాద్రి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ )గా బెన్ షాలోం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన కలెక్టర్ హనుమంతు జెండగేను మర్యాద పూర్వకంగా కలిశారు. హుస్నాబాద్‌లో ఆర్డీవోగా పని చేస్తున్న షాలోం ఇక్కడికి బదిలీపై వచ్చారు. లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్‌గా బి. రాజేశం యాదాద్రికి రానున్నారు. ఇప్పటివరకు ఆయన తెలంగాణ హౌజింగ్ బోర్డు సెక్రెటరీగా పనిచేశారు.